మాజీ ఎమ్మెల్యే రసమయి పరామర్శ..
మాజీ ఎమ్మెల్యే రసమయి పరామర్శ..
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్కిస మహిపాల్ రెడ్డి, చంద్రారెడ్డి మాతృమూర్తి ముక్కిస కనకవ్వ ఐదు రోజుల క్రితం మృతిచెందింది. ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, రమణరెడ్డి మేనత్త ముక్కిస ముత్తవ్వ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. దివంగతులైన కనకవ్వ, ముత్తవ్వల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ దుఃఖాన్ని భరిస్తున్న కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం, ఓదార్పు కల్పించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కలిగించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
