ధాన్యం నిల్వలకు అదనపు గోదాములు

ధాన్యం నిల్వలకు అదనపు గోదాములు
- పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం నిల్వ చేసేందుకు అదనపు గోదాములను ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలియజేశారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ లో మొక్కజొన్న నిల్వల కోసం ఏర్పాటుచేసిన గోదామును పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ. జిల్లాలో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న నిల్వ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాములకు అదనంగా పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో గల ఐజి గోదాంలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని సిద్ధం చేశామన్నారు.
రేపటి నుండి జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుంచి రంగాపూర్ ఐజి గోదాంకు మొక్కజొన్న తరలింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిల్వ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగినంత హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. గోదాముల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించి నిల్వ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు
