భౌతిక శాస్త్ర విభాగంలో విద్యార్థులకు అవగాహన

భౌతిక శాస్త్ర విభాగంలో విద్యార్థులకు అవగాహన
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
పరకాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎలెక్ట్రానిక్స్ అనే అంశంపై కళాశాల విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ విస్తృత అవగాహన కాకతీయ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ ఎన్ వరలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి సంతోష్ కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్ మల్లయ్య, ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎలిషాల అశోక్ , భౌతిక శాస్త్ర విభాగ అధిపతి ఎస్ రాజశ్రీ, అధ్యాపకులు డాక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ టి కల్పన, బి మహేంద్రరావు, డాక్టర్ జి పావని, డాక్టర్ ఆడెపు రమేష్, డాక్టర్ కె జగదీష్ బాబు, ఆర్ ఈశ్వరయ్య, కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ జి రాజేశ్వర్ కుమార్, డాక్టర్ డి సంజయ్ కుమార్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
