ఆర్టీసీ ఆదాయం పెంపుకు సహకరించాలి..
తొర్రూరు, ఆంధ్రప్రభ : ఆర్టీసీ ఆదాయం పెంపుకు సిబ్బంది సహకారం అందించాలని తొర్రూరు ఆర్టీసీ డిఎం కె. ప్రసూన లక్ష్మి తెలిపారు.డిఎంగా బాధ్యతలు స్వీకరించిన ప్రసూన లక్ష్మిని మంగళవారం డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ….ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్, కండక్టర్ల పాత్ర ఎనలేనిదన్నారు.
ప్రయాణీకులకు మెరుగైన సేవలందించడమే ముందున్న లక్ష్యమన్నారు.మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ లాభాలబాట పట్టిందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అలాగే బస్సుల్లో గూగుల్‌పే, ఫోన్‌పే వంటి ఆన్లైన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ కుమార్, డిపో కార్యదర్శి జిలుకర యాదగిరి, ప్రతినిధులు ఎంకే రావు, యాకన్న, సతీష్, సత్తయ్య, వనజ, రాజేశ్వరి, శ్రీలత, రాధిక, ధనుంజయ్, టి వై రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
