Andhra Prabha SPL Story | మోడీ గెలుపు తర్వాత కేరళ రాజకీయ సమీకరణాలు..

Andhra Prabha SPL Story | మోడీ గెలుపు తర్వాత కేరళ రాజకీయ సమీకరణాలు..

Andhra Prabha SPL Story | కేరళలో కాంగ్రెస్ విజయాలు ఎందుకు తగ్గాయి
కరుణాకరన్ నిష్క్రమణ ప్రభావం
ఊమన్ చాందీ – చెన్నితల వర్గపోరు
2011 ఎన్నికలు మరియు ముస్లిం లీగ్ ప్రభావం
2021లో మైనారిటీల సంఘటితం మరియు పినరయ్ విజయన్
కేరళలో బీజేపీ ఎదుగుదల కారణాలు
2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రభావం

Andhra Prabha SPL Story | కేరళం రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 2001 నుంచి చెప్పుకోదగిన విజయంను సాధించలేదు. 2011లో యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడిఎఫ్‌) కడపటి సారిగా గెలుపొందింది. అయితే, కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ కన్నా కాంగ్రెస్‌ ఏడు సీట్లు మాత్రమే అధికంగా గెల్చింది. అయితే.. ఎల్‌డిఎఫ్‌ మద్దతుతో గెల్చిన ఇద్దరు నుంచి కేరళంలో కాంగ్రెస్‌ దుస్థితికి అనేక వాదాలను చెబుతున్నారు. అయితే, యూడీఎఫ్‌ లోక్‌సభ ఎన్నికల్లో బాగానే సీట్లు సంపాదించింది. దీనిని ఏమంటారు? ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కారణమని చాలా మంది అభిప్రాయం.

కరుణాకరణ్‌ నిష్క్రమణ: 2005లో మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌, ఆయన అనుచరులు వైదొలగడం యూడీఎఫ్‌కు ఎదురు దెబ్బ.1964, 1969, 1978లో కాంగ్రెస్‌లో చీలికలు వచ్చాయి. కరుణాకరన్‌ ఐఎన్‌టీయూసీ ద్వారా కాంగ్రెస్‌లోకి వచ్చారు. కేరళంలో కేడర్‌ ప్రాతిపదికగా పని చేసే సంస్థ ఐఎన్‌టీ యుసి. ఎకె ఆంటోనీ నేతృత్వంలోని వర్గం ప్రజలతో సంబంధాలను మెరుగుపర్చుకునే వ్యూహాలతో తిరిగి వెనక్కి వచ్చింది. కరుణాకరన్‌ సంఘ్‌ పరివార్‌ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ముందుకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో భారతీయ పార్టీ అవతరించింది. ఆయన బీజేపీతో కానీ, సిీపీఎంతో కానీ పొత్తుకు అంగీకరించలేదు. ఆయన పూర్వపు సహచరులు బీజేపీ ప్రాథమిక సభ్యులుగా మిగిలిపోయారు. కరుణాకరన్‌ కేరళంలో అగ్రవర్ణమైన నాయర్‌ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన వైదొలగడంతో కాంగ్రెస్‌ నాయకుడు లేని నావలా తయారైంది. కరుణాకరన్‌ కన్నుమూసే ముందు మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. కానీ, ఆయన అనుచరులు తిరిగి రాలేదు.

ఊమన్‌ చాందీ-చెన్నితల కలయిక: కరుణాకరన్‌, ఆంధోనీల మధ్య ముఠాలను తిరిగి కలిపేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాంతో కార్యకర్తలు ఐకమత్యంగా పని చేశారు. వారిని ఊమన్‌ చాందీ, రమేష్‌ చెన్నితలలు ఆకర్షించారు. చాందీ ముఖ్యమంత్రి అయ్యారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత రమేష్‌ చెన్నితల ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయ్యారు. చెన్నితల తిరుగుబాటు చేశారు. వారిలో కేసి వేణుగోపాల్‌, వి.డి.సతీషన్‌లు ఉన్నారు. కరుణాకరన్‌ తన కుమారుడు కె.మురళీధరన్‌ను వారసునిగా తెరమీదికి తెచ్చారు. చాందీ, చెన్నితల వర్గాలు కలహాలకు దిగేవి. ప్రతిభకు గుర్తింపు రాకపోవడం వల్ల వర్గపోరు పెరిగింది.

2011 ఎన్నికలు: యూడీఏఫ్‌ అధికారంలోకి రాగలిగింది. అయితే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ (ఐయుఎంఎల్‌) 20 సీట్లు సంపాదించి మద్దతు ఇచ్చేందుకు బేరాలు పెట్టింది. ఐదు మంత్రి పదవులను సంపాదించింది. విద్యా శాఖపై హిందూ మత సంస్థలు ధ్వజమెత్తాయి. కోర్టు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను కొట్టి వేసింది. దీంతో కులపరమైన సమీకరణ జరిగింది. నాయర్‌ సర్వీస్‌ సొసైటీ, ఎస్‌ఎన్‌డిపి తమ మధ్య విభేదాలు విస్మరించాయి. భారతధర్మ జనసేన ఏర్పాటుకు ఇదే నేపథ్యం.

2014లో మోడీ గెలుపు: మోడీ గెలుపుతో సమీకరణాలు మారాయి. హిందూ సంఘాలు బీడీజేఎస్‌ ఏర్పాటులో సహకరించాయి. ముస్లింలు యూడీఎఫ్‌ లేదా ఎల్‌డీఎఫ్‌లో చేరాలా అనే పరిస్థితి ఏర్పడింది. 2019లో కాంగ్రెస్‌ 19 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. రాహుల్‌ గాంధీ వాయనాడ్ నుంచి గెలుపొందారు.

2021లో మైనారిటీల సంఘటితం: సిఏఏ, ఎన్‌ఆర్‌సీ కారణంగా ముస్లింలు పినరయ్‌ విజయన్‌కు అండగా నిలిచారు. ఆయనను బలమైన నాయకుడిగా గుర్తించారు. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వం అందించిన సేవలు కలిసొచ్చాయి. సోషల్‌ ఇంజనీర్‌గా పేరు సంపాదించారు. సులభంగా విజయం సాధించారు.

బీజేపీ ఎదుగుదల: కేరళంలో బీజేపీ ఎదుగుదలకు వామపక్షాలు కుప్పకూలడమే కారణం అన్న అభిప్రాయం ఉంది. సీపీఎంను హిందూ పార్టీగా పరిగణించడం ప్రారంభమైంది. బీజేపీ నాయర్‌, ఎజెవా ఓటు బ్యాంకులకు గండికొట్టింది. మైనారిటీలు సంఘటితం అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు.

2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ: నియోజకవర్గాల మార్పు కాంగ్రెస్‌కు దెబ్బతింది అన్న వాదన ఉంది. చాందీ-చెన్నితల వర్గపోరు, పినరయ్ విజయన్ సోషల్ ఇంజనీరింగ్, సామాజిక వర్గాల సమీకరణ, బీజేపీ ఎదుగుదల వంటి అనేక కారణాలు ప్రభావం చూపాయి. ఈసారి ఎన్నికల్లో మైనారిటీలు యూడీఎఫ్‌కు మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఎదుగుదలతో మైనారిటీలు సంఘటితంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు.

  • ఆనంద్‌ కూచికూడీ @Anandkochukudy
    కేరళంకు చెందిన జర్నలిస్టు, కాలమిస్టు..

Leave a Reply