CM Revanth Reddy | సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం

CM Revanth Reddy | సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం

CM Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ తీర్పును స్వాగతిస్తూ ప్రభుత్వం పారదర్శకతకు ఇది గుర్తింపని పేర్కొన్నారు.

నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించి, పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో హైకోర్టు ఈ నియామకాలను కొనసాగించవచ్చని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిటిషన్లను డిస్మిస్ చేసింది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని తెలిపారు. సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రూప్-1 అభ్యర్థులకు ఇది పెద్ద ఊరట అని పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరితగతిన నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, నియామక పత్రాలు అందజేసిందని చెప్పారు. ఈ ప్రక్రియను అడ్డుకోవాలనుకున్న కుట్రలను ఎదుర్కొని, యువతను రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములను చేసినట్లు వెల్లడించారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతలో విశ్వాసం కలిగించామని పేర్కొంటూ, నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసిన ఛైర్మన్, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Leave a Reply