ఆయన సహకారంతో పరిష్కరిస్తాం..

ఆయన సహకారంతో పరిష్కరిస్తాం..
రేగొండ, ఆంధ్రప్రభ : వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో సర్పంచ్ కాడవేన సరిత – యుగేందర్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహించినట్లు కార్యదర్శి స్రవంతి పేర్కొన్నారు. ముందుగా సీఎం సందేశాన్ని చదివి గ్రామ ప్రజలకు వినిపించారు. అనంతరం గ్రామంలో ప్రజాప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను కార్యదర్శి వెల్లడించారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే సత్యనారాయణరావు సహకారంతో పరిష్కరిస్తామని సర్పంచ్ తెలిపారు.
