ఉట్నూర్ ను మోడల్ గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీని మోడల్ గా తీర్చిదిద్దుతానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూర్ లోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ అధ్యక్షతన వహించారు.
ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజ్యర్షిషా ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ట్రైన్ అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అన్ని వర్గాల సంక్షేమం గురించిఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా దశల వారీగా ఇండ్లు మంజూరు చేయిస్తామని మొదటి విడత కింద ఐదు వేల ఇల్లు మంజూరు అయ్యాయని ఉట్నూర్ కేవలం 60 ఏళ్లు మాత్రమే మంజూరయ్యాయని ఈ నెలలో రెండో విడతలో ఉట్నూరు పట్టణానికి అధికంగా ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు.
అర్హులైన నిరుపేదలకు ఖానాపూర్ నియోజకవర్గం లో 25000 వేల రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి రేషన్ కార్డుదారునికి సన్నబియ్యం మూడు పూటలు తినే విధంగా ప్రభుత్వం అందిస్తుందని ఆయన అన్నారు. మహిళల సంక్షేమం కోసం మహాలక్ష్మి గృహలక్ష్మి పథకాల ద్వారా ఉచిత బస్సు సౌకర్యంతో పాటు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఐబి నుండి పాత బస్టాండ్ కు వరకు ఉన్న రోడ్డు ఇరువైపులా వ్యాపారులు దుకాణాల బోర్డులు ఏర్పాటు చేశారని వాటిని తొలగించేలా పంచాయతీ వారు నోటీసులు ఇవ్వాలని, ఎవరు కూడా రోడ్డు భూమిని ఆక్రమించుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
ఉట్నూర్ పట్టణంలోని ప్రతి కాలనీలో ఏ సమస్యలున్నాయి నాకు తెలిసిన అని తాను పాదయాత్రగా ప్రతి కాలనీలో తిరిగి సమస్యలు తెలుసుకున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజర్సీషా మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఏ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. సమస్యలు తెలుసుకోవడానికి గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ గ్రామ సభలో ఉట్టూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, ఉప సర్పంచ్ అస్త్రం బేగం అన్సారి, డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, అదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు, నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.
