సక్కారం తండాలో పోలీసుల వాహన తనిఖీలు

పత్రాలు లేని వాహనాలపై చర్యలు.. 35 బైక్‌లు, 2 ఆటోలు సీజ్

ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సక్కారం తండాలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఉట్నూర్-ఇంద్రవెల్లి సీఐ మడావి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ తనిఖీల్లో 30 మంది పోలీస్ సిబ్బంది, ఇంద్రవెల్లి ఎస్‌ఐ సాయన్న పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, మరో 6 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా సీఐ మడావి ప్రసాద్ గ్రామస్తులకు వాహన నిబంధనలపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.