Green Signal | ఏపీ రాజధానిగా అమరావతి..

Green Signal | ఏపీ రాజధానిగా అమరావతి..
రాజ్యసభలో ఆమోదం
Green Signal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో అమరావతి రాజధాని అంశంపై కీలక ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుపై జరిగిన చర్చను కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రారంభించారు. చర్చ సమయంలో పలు అంశాలు ప్రస్తావనకు రాగా, వైకాపా సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేశారు. లోక్సభ ఆమోదం అనంతరం రాజ్యసభలో కూడా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో, అమరావతి రాజధాని అంశంపై చట్టపరమైన స్పష్టతకు మార్గం సుగమమైంది.
