వైభవంగా పల్లకి సేవ..

వైభవంగా పల్లకి సేవ..
మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం హనుమాన్ జయంతి పురస్కరించుకుని మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి ఆనంద్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామకమిటీ, ఆలయకమిటీ, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
