సత్తా చాటిన జాగిర్యాల్ సర్పంచ్ దంపతులు
సత్తా చాటిన జాగిర్యాల్ సర్పంచ్ దంపతులు
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద ఆదివారం నిర్వహించిన తెలంగాణ రన్స్ ఈవెంట్లో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం జాగిర్యాల్ గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్, అనిత దంపతులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా గడాల ప్రసాద్, అనిత 5 కిలోమీటర్ల పరుగును 27 నిమిషాల్లో పూర్తి చేశారు. అలాగే గడాల మహేష్ 21 కిలోమీటర్ల పరుగును 2 గంటల 26 నిమిషాల్లో పూర్తి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు.
గ్రామ ప్రజలు, యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి రన్నింగ్ ఈవెంట్లలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. క్రమం తప్పకుండా పరుగులు తీయడం ద్వారా శారీరక దృఢత్వం, ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వివరించారు.
