అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంట క్షేత్రాల సర్వే ని చేపట్టాలి : మాజీ ఎంపీపీ జివి రమణారావు

కుంటాల, ఆంధ్రప్రభ : అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ కుంటాల మండలంలోని అందకుర్ గ్రామంలోని గత రెండు రోజుల క్రితం అకాల వర్షం గాలివాన బీభత్సం మూలంగా దెబ్బతిన్న మొక్కజొన్న జొన్న పంటలను, వరి పంట క్షేత్రాలను మాజీ ఎంపీపీ జివి రమణ రావు తోపాటు బిజెపి శ్రేణులు రైతులు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం అకాల వర్షం మూలంగా కుంటాల మండల వ్యాప్తంగా దెబ్బతిన్న పంట క్షేత్రాలను ఆయన పరిశీలన చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ దెబ్బతిన్న పంటలకు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులతో మరియు రెవెన్యూ అధికారులతో పంటల సర్వే నిర్వహించి, రైతులకు పరిహారం అందించాలని ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న జొన్న తో పాటు వరి పంటలు నేలకొరిగిపోవడంతో రైతులు ఆందోళన చెంది దిగులు చెందుతున్నారని, లక్షల పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో గాలివాన బీభత్సం ఆగమాగం చేసి నేలకొరవడంతో రైతులు దిగులు చెందుతున్నారని రైతులకు బిజెపి పార్టీ అండగా ఉంటుందని రైతులకు భరోసా తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు.

దీంతో ఒక ఎకరానికి రైతులకు 25 నుంచి 30 వేల రూపాయలు పంట నష్టం జరిగిందని పరిహారం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అధికారుల లతో సర్వేలు నిర్వహించాలని వారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు జక్కుల గజేందర్ ప్రవళి ప్రశాంత్ సిందే సవిత బాజీరావు బిజెపి పార్టీ నాయకులు శ్రీనివాస్ మాధవరావు రైతుల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply