అయ్యప్ప స్వామికి అభిషేకాలు..

అయ్యప్ప స్వామికి అభిషేకాలు..

భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

ఆంధ్రప్రభ, చిట్టినగర్ : అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు ను పురస్కరించుకొని శ్రీ ఈశ్వర పుత్ర భక్త బృందం వారి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట లో సాయిబాబా ప్రశాంత నిలయం లో అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు ఈశ్వర పుత్ర భక్త బృందం గురుస్వామి కామరాజ్ హరీష్ కుమార్ ఆచారి, బాబా ప్రశాంత నిలయం నిర్వాహకులు భోగవల్లి పృథ్వి సాయి కుమార్ పూజ కైంకర్యాలు నిర్వహించగా అయ్యప్ప భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి నామస్మరణతో కనులవిందుగా అభిషేక కార్యక్రమం కొనసాగింది.

అనంతరం అష్టోత్తరపూజలునిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణి చేసి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా హరీష్ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా సాయిబాబా ప్రశాంత నిలయంలో అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు అర్చన కార్యక్రమం నిర్వహించి భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సత్తిరాజు,శ్రీనివాసన్,నాగోతి సాయి కుమార్,సాయి హర్ష,బబ్లు,పవన్ శ్రీ కళ్యాన్,జగదీష్,మరియు ఈశ్వర పుత్ర భక్త బృందం సభ్యులు,సాయిబాబా ప్రశాంత నిలయం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply