ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మలిదశ ఉద్యమకారులు పలువురు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లో మంగళవారం మాట్లాడుతూ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఉద్యమకారుల విషయంలో ఒక స్పష్టతకు రాకపోవడం బాధాకరమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూనుకొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీల నెరవేర్చాలని సూచించారు. జంపాల శ్రీనివాస్, ఆడెపు బాలస్వామి, వడ్డేమాన్ మహేందర్ పాల్గొన్నారు.