ఘనంగా చేగుంట శ్రీ పార్వతి పరమేశ్వర రథోత్సవం..

ఘనంగా చేగుంట శ్రీ పార్వతి పరమేశ్వర రథోత్సవం..

కృష్ణ, ఆంధ్రప్రభ : చేగుంట గ్రామంలోని శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కళకళలాడింది. రథోత్సవంలో స్వామివారిని అలంకరించిన రథంపై గ్రామ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లగా, భక్తులు హారతులు పట్టి మొక్కులు చెల్లించారు.

డోలు, తాషా, మంగళ వాద్యాల మధ్య రథం ముందుకు సాగగా గ్రామమంతా భక్తి వాతావరణం నెలకొంది
ఈ కార్యక్రమం ఆలయ ధర్మదికారి శ్రీ డా క్షీరలింగ స్వామి ఆధ్వర్యంలో జరిగింది. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతర సందర్భంగా అన్నదానం, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

Leave a Reply