యువత బెట్టింగ్, డ్రగ్స్, గంజాయిని పారదోలాలి..

యువత బెట్టింగ్, డ్రగ్స్, గంజాయిని పారదోలాలి..

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మైని అరుణ్ జ్ఞాపకార్ధంగా చలివేంద్రం ప్రారంభం
స్థానిక సర్పంచ్ రెమ్మ భానుచందర్

రెంజల్, ఆంధ్రప్రభ : సమాజ యువత డ్రగ్స్, బెట్టింగ్, గంజాయి లాంటి మత్తు పానీయాల బారిన పడకుండా సన్మార్గాంలో నడవాలని స్థానిక సర్పంచ్ రెమ్మ భానుచందర్ సూచించారు. సోమవారం కీర్తిశేషులు మైని అరుణ్ కుమార్ జ్ఞాపకార్ధంగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళ్యాపూర్ గ్రామ చౌరస్తాలోని చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండల ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు కంఠం బాలకృష్ణ, ఉప సర్పంచ్ కాలేరు శ్రీకాంత్, ఎఫ్ వైఏ మండల అధ్యక్షుడు మైని సంతోష్, ప్రముఖ నాయకుడు నల్ల నవీన్ లతో కలిసి భానుచందర్ ప్రారంభం చేశారు.

మత్తు పదార్థాల బారిన పడ్డ యువత నడుమంత్రం తమ విలువైన ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, జీవితాలను సైతం నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మత్తు పదార్థాల వాటి జోలికి వెళ్లకూడదని, ఎప్పటికీ దూరం ఉంచాలని ఆయన పేర్కొన్నారు. సురాయిలలో మిలన్నర్ వాటర్ ని గ్లాసులలో పొసి ఇవ్వడం ఒక పుణ్యంతో కూడుకున్న కార్యమని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని సర్పంచ్ అన్నారు.

ముఖ్య సలదారుడు కంఠం బాలకృష్ణ మాట్లాడుతూ.‌..తమ సంస్థ ఏర్పడి నేటికీ 12 సంవత్సరాలు అవుతుందని, అప్పటి నుండి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కళ్యాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ స్థాపించి, అంచలంచలుగా ఎదుగుతూ అనేక సేవ కార్యక్రమాలు చేపడుతూ మండలంలో ఎదురులేని శక్తిగా దిగిందన్నారు. ప్రస్తుతం మండల కేంద్రంతో పాటు సాటాపూర్, దూపల్లి, నీలా, తాడ్ బిలోలి గ్రామాలలో తమ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 5,14 తేదీల్లో జాతీయ నాయకుల జయంతి రోజు రక్తదానం, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కాలేవర్ సంజీవ్, కాశం భరత్, మధు కృష్ణ, లోకేష్, కాశం శ్రీను, సాటె శ్రీనివాస్, సాకలి సాయినాథ్, సురేందర్, మల్లారి సురేష్, మైనిరాజు, కురుమే ప్రవీణ్, పోతరాజు నరేష్,ఐటి సుమన్, గణేష్, బిందు, పోశెట్టి, మల్లారి ప్రశాంత్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply