నటుడు బ్రహ్మానందంను కలిసిన చిత్రకారుడు రాయబోస్

కడెం, ఆంధ్రప్రభ : తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన హాస్యంతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు బ్రహ్మానందంను నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్ రహమాన్ (రాయబోస్) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చిత్రకారుడు రహమాన్ తన చేతితో చిత్రించిన ప్రత్యేక కళాఖండాన్ని బ్రహ్మానందంకు అందజేశారు. ఆ చిత్రాన్ని చూసిన బ్రహ్మానందం ఆనందం వ్యక్తం చేస్తూ కళాకారుడి ప్రతిభను ప్రశంసించారు.

బ్రహ్మానందం స్వయంగా కూడా చిత్రలేఖనంలో మంచి నైపుణ్యం కలిగి ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన పలువురికి తన చేతితో గీసిన చిత్రాలను బహుమతిగా అందించిన సందర్భాలు ఉన్నాయి.

Leave a Reply