ఇలా లంచం తీసుకున్నాడు… అలా….
- రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టివేత..
ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : రిటైర్డ్ అయిన ఉద్యోగి పెన్షన్ బెనిఫిట్స్ (Pension Benefits) కోసం రూ.6వేలు లంచం తీసుకుంటూ వైద్య ఆరోగ్యశాఖ (Health department) క్లర్కు ఏసీబీ (ACB) కి పట్టుబడ్డాడు. మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగ విరమణ పొందిన తోట వెంకటేశ్వర్లు (Thota Venkateswarlu) తనకు రావలసిన ఉద్యోగ సర్విస్ బెనిఫిట్స్ కోసం అధికారుల చుట్టూ తిరిగాడు.
రూ.6 వేలు లంచం ఇస్తేనే ఫైలు ముందుకు కదుపుతానని ఎల్‌డిసి (జూనియర్ అసిస్టెంట్) గడియారం శ్రీనివాస్ (Srinivas) తేల్చి చెప్పాడు. లంచం ఇచ్చేందుకు మనసొప్పక బాధితుడు ఏసీబీ (ACB) అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం నస్పూర్ సమీకృత కలెక్టరేట్ భవనం సమీపంలోనీ డీఎంహెచ్ వో కార్యాలయం (DMHO Office) వద్ద రూ.6 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని శ్రీనివాస్ ను పట్టుకొని రిమాండ్ కు తరలించారు.
