మంత్రి శ్రీధర్ బాబును కలిసిన సెగ్గెం రాజేష్

మంథని, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి సెగ్గెం రాజేష్ తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇరువురు పలు ముఖ్య అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబుకు సెగ్గెం రాజేష్ పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply