మల్లాయి చిట్టూరులో ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభం

ఘంటసాల, ఆంధ్రప్రభ ; ఘంటసాల మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని నియోజకవర్గ జనసేన నాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు. సోమవారం ఘంటసాల మండల పరిధిలోని మల్లాయి చిట్టూరు గ్రామంలో ఘంటసాల మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకట్రామ్ మాట్లాడుతూ రా కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. పశువులకు ఎలాంటి వ్యాధులు దరి చేరకుండా గాలికుంటు వ్యాక్సిన్లు, ఉచితంగా మందులను అందజేయడం జరుగుతుందన్నారు. పాడి రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు, దాణా అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, సర్పంచ్ ఆవుల రేవతి టిడిపి మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, నీటి సంఘం అధ్యక్షులు ఆవుల ధర్మ వెంకట నరసయ్య, లంకపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు ఎనుముల నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి లోని నాగ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ చింతల నాగబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కోలపల్లి హర్ష, గుత్తి ధనలక్ష్మి, కొమరగిరి నాగిని, పశుసంవర్ధక శాఖ ఏడిఏ డాక్టర్ కోసూరు రవీంద్ర, పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోసూరు రవీంద్ర పశువులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఏఎంసీ వారు అందించిన మందులను ఉచితంగా అందజేశారు.