లోవోల్టేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్…

లోవోల్టేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్…

  • సర్పంచ్ చొరవతో న్యూ ఆబాధిలో విద్యుత్ పునరుద్ధరణ
  • అభినందించిన ఆబాదివాసులు, గ్రామ ప్రజలు

కుభీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిఘ్వ గ్రామంలోని న్యూ అబాదిలో గత కొన్నేళ్లుగా లోవోల్టేజీ సమస్య కారణంగా ఇండ్లలోని తాగునీటి బోర్లు పనిచేయకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడం, కూలర్లు తిరగకపోవడం అవధిలో ఏదైనా వెల్డింగ్ పనులు చేయాలన్న ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గాను స్థానిక గ్రామ సర్పంచ్ మంచు రమేష్ ప్రత్యేక చొరవ తీసుకొని విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి శనివారం కాలనీలో మినీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించి స్విచ్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను ప్రారంభించారు.

మసక చీకట్లలో కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్న ఆబాదిలో వెలుగులు విరజమ్మడం గ్రామస్తులను ఆబాధి వాసులను ఆనందంలో ముంచెత్తింది. ఫ్యాన్లు, కూలర్లు, ఇండ్లలోని మోటార్లు పనిచేస్తుండడంతో కాలనీవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా ఎందరో ప్రజాప్రతినిధులను మొరపెట్టుకున్న పరిష్కారం కానీ ఈ సమస్యను సర్పంచ్ రమేష్ ప్రత్యేక చొరవ తీసుకొని మా అబాదికి వెలుగులను నింపిన ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఇంతకాలం నువ్వుంటే సమస్యతో ఎందరో ఇళ్లలో గృహపకరణాలు కాలిపోయి నష్టపోయామని ఎన్నికైన వంద రోజుల్లోనే తమ చిరకాల సమస్యను తీర్చిన సర్పంచు రమేష్ ను కలిసి ఆ లింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి పోతుల పరమేష్ కే ఆనంద్ ఎస్ ఆనంద్ గంగాధర్ రాములు విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply