సీనియర్ జర్నలిస్టు ను పరామర్శించిన జాన్సన్ నాయక్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ చెందిన సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ కరీం సతీమణి ఇటీవల మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుఖ్య జాన్సన్ నాయక్ సోమవారం ఉట్నూర్ లోని సీనియర్ జర్నలిస్ట్ కరీం నివాసానికి వెళ్లి ఆయనను కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతి గల కారణాలు అడగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించి ఓదార్చారు.ఆయన వెంట బిఆర్ఎస్వి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply