పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి..

పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి..

ఆయన పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
స్టేషన్ ఘన్ పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కనకం రమేష్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : అసెంబ్లీలో దళితుల పట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అగౌరవంగా అనుచి తంగా వ్యవహరిస్తున్నారు. అదే సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై స్పీకర్ వెంటనే భర్తరఫ్ చేయాలి..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, స్టేషన్ ఘన్ పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కనకం రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అసెంబ్లీలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యు లు కడియం శ్రీహరి మాట్లాడుతుండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవ ర్తించిన తీరు, మాట్లాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిండు సభ లో ఒక దళిత ఎమ్మెల్యేను అవమానించడం, ఈ రాష్ట్రంలో అనేక మం త్రి పదవులు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ఈ రాష్ట్రానికి సేవలం దించిన దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పట్టుకొని బిఆర్ఎస్ ఎమ్మె ల్యే కౌశిక్ రెడ్డి గన్ తో కాల్చి పడేస్తానంటూ చేయితో సైగలు చేస్తూ బెదిరించడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఆందోళనలు చేపడతామని హేచ్చరించారు.

Leave a Reply