నిధులన్ని మంత్రులు… సీఎంలకేనా…

నిధులన్ని మంత్రులు… సీఎంలకేనా…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా మంత్రులు, ముఖ్యమంత్రుల నియోజకవర్గాలకు వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కోసం మంత్రులు, సీఎం చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం ఏం చేసినా ఖమ్మం జిల్లాకే వెళ్తోందని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌ను అభివృద్ధి చేసుకున్నట్లే, ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం మునుగోడును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండదా అని దుయ్యబట్టారు. మధిర, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకే లిఫ్ట్‌లు తరలిస్తున్నారని విమర్శించారు. మునుగోడులో ఒక చెరువు గానీ, కుంట గానీ లేదని అన్నారు. ప్రజలకు న్యాయం చేయకపోతే తాను పదవిలో ఉండటానికి అనర్హుడినని అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా మనోవేదనతో రగిలిపోతున్నానని, ప్రాంతాలు, నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.