ఘనంగా తెలుగు దేశం ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

ఘనంగా తెలుగు దేశం ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామంలో మెయిన్ సెంటర్లో ఆదివారం 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తెలుగు దేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. జై టీడీపీ, జై జై టీడీపీ అని నినాదాలతో చాపరాలపల్లి గ్రామం మారుమ్రోగింది.

అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్రను మళ్లీ గుర్తు చేసుకుంటోంది. 1982లో ఆరంభమైన ఈ ప్రయాణం.. విజయాలు, పరాజయాలు, సంక్షోభాలు, పునరాగమనాలతో నిండిన ఒక దీర్ఘ గాథ.“తెలుగు వాడి ఆత్మ గౌరవం” అనే నినాదంతో మహానటుడు నందమూరి తారక రామారావు 1982 లో స్థాపించిన ఈ పార్టీ అప్పటి రాజకీయ వ్యవస్థను సవాల్ చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు వచ్చింది. ఒక ఏడాది కాలంలోపే 1983 లోనే అధికారంలోకి రావడం టీడీపీ చరిత్రలోనే కాక, దేశ రాజకీయాల్లో కూడా ఒక మైలురాయి. తెలుగు రాజకీయాల్లో ఒక విప్లవ శక్తిగా అవతరించిన పార్టీగా టీడీసీ ముద్ర వేసుకొంది.

ప్రజా నమ్మకం, ఆత్మగౌరవం, అభివృద్ధి.. ఈ మూడు సూత్రాలతో తన ప్రయాణాన్ని నిర్మించుకుంది. 1982లో “నందమూరి తారక రామారావు” వేసిన ఆ విత్తనం… నేడు ఒక విశాల వృక్షంగా ఎదిగి, మళ్లీ అధికారాన్ని అందుకుంది. “తెలుగు వాడి ఆత్మ గౌరవం” అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల్లో జ్వాల రగిలించారు. 1983లోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1984లో సంక్షోభం, ఎదురైనా కుదుపులు పార్టీని కదిలించినా.. ప్రజల తీర్పు టీడీపీని తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టింది. 1995లో సంక్షోభం నెలకొని పార్టీ పరిరక్షణ కోసం “నారా చంద్రబాబు నాయుడు” నాయకత్వంలో పార్టీకి కొత్త దిశగా పయనిస్తోంది. 1995 నుంచి 1999 వరకు తిరిగి 1999 నుంచి 2004 వరకు రెండు సార్లు చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి గా పని చేశారు. 2004, 2009 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ తో పోరాటం చేసి ఓటములు చవిచూసింది.కానీ ప్రజల మధ్యే నిలిచిన పార్టీ ప్రతిపక్షంలో పోరాటం కొనసాగించింది. ఓటముల తర్వాత కూడా టీడీపీ వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తూ ప్రతిపక్షంలో తన గళాన్ని వినిపించింది.

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. నూతన రాష్ట్ర నిర్మాణంలో టీడీపీ కీలక పాత్ర నిర్వహించింది. 2019లో వైయస్ఆర్ సీపీ నాయకుడు జగన్ తో పోటీ పడి ఓటమి పొందింది. ఆ ఓటమిని పార్టీ సవాల్ గా తీసుకుని 2024 ఎన్నికల్లో ప్రజా తీర్పుతో మళ్లీ అధికారంలోకి టిడిపి వచ్చింది. “నారా చంద్రబాబు నాయుడు” మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 44 సంవత్సరాల పార్టీ చరిత్ర ను సూక్ష్మంగా పరిశీలిస్తే 1982 – పార్టీ స్థాపన. 1983 – తొలి విజయం. 1995 నాయకత్వ మార్పు. 1995-99, 1999-2004 అధికారం. 2004–2014 – ప్రతిపక్ష దశ. 2014 అధికారంలోకి 2019 ఓటమి 2024 – ఘన పునరాగమనం ఇది పార్టీ చరిత్ర. “ప్రజలే మా బలం.. వారి విశ్వాసమే మా విజయం” – నారా చంద్రబాబు నాయుడు. “తెలుగు వాడి గౌరవం కోసం ఈ పార్టీ పుట్టింది” –నందమూరి తారక రామారావు. ఇది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.