సకాలంలో వర్షాలు కురవాలని పూజలు
కోదాడ (ఆంధ్రప్రభ): సకాలంలో వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోదాడ పట్టణంలో గురువారం బొడ్రాయమ్మ తల్లికి ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు మాట్లాడుతూ, బొడ్రాయమ్మ తల్లి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, కమిషనర్ రమాదేవి, నూనె సులోచన, రాంశెట్టి కృష్ణవేణి, రంగు శిరీష, వివిధ పార్టీల నాయకులు పైడిమర్రి సత్తిబాబు, పైడిమర్రి వెంకటనారాయణ, రామినేని శ్రీనివాసరావు, రావెళ్ల కృష్ణారావు, ఎండీ కాజా, ముత్యాలమ్మ తల్లి కమిటీ సభ్యులు వట్టివేళ్ల రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు తోట జ్యోతి శ్రీనివాస్, గంధం బాలేంద్ర పాండు, చీమ నరేష్, పి. ఏసుపాదం, కర్రీ సుబ్బారావు, నరసయ్య, ఒంటిపులి శ్రీను, ఉప్పుగళ్ల శ్రీనివాస్, పందిరి సత్యనారాయణ, జిల్లేపల్లి నాగేశ్వరరావు, వేముల రాముడు, తోట వెంకటేశ్వర్లు, సుంకర సత్యనారాయణ, మురళి పుల్లయ్య, ఓం శ్రీనివాస్, పురపాలక సంఘం సభ్యులు, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
