తాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మనుమడు

తాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మనుమడు
ఘంటసాలలో అడుగు పెట్టిన అంబేద్కర్ వారసుడు
ఘంటసాల – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఘంటసాల మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి అంబేద్కర్ వారసుడు వచ్చారు. శనివారం అంబేద్కర్ విగ్రహవిష్కరణ నేపథ్యంలో విజయవాడ నుంచి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రెండవ మనవడు భీమ్ రావ్ యశ్వంత్ అంబేద్కర్ ఘంటసాల వచ్చారు. పెనమలూరు నుంచి కొడాలి వరకు అశేష జనవాహిని ఆయనను తొడ్కోని వచ్చారు.
కొడాలి నుంచి భారీ ర్యాలీగా ఘంటసాల తీసుకొచ్చారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవి ప్రసాద్ అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంబేద్కర్ అభిమానులు వందలాదిమంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా, పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.


