పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం..

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిప్పాపూర్, రామేశ్వర పల్లి గ్రామంలో బాధిత కుటుంబాల ఇండ్లలోకి వెళ్లి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ… అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. అనారోగ్యంతో ఎవరైనా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం చేయించుకుంటే ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందజేస్తుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు చెప్పారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరాం వెంకటేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజబాబు గౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు లింగారెడ్డి, చేపూరి రాణీ రాజు, ఉప సర్పంచ్ జీవన్, వినోద్ గౌడ్ పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.