ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చే నిర్ణయాన్ని రద్దు చేయాలి


ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చే నిర్ణయాన్ని రద్దు చేయాలి

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ:

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చే నిర్ణయాన్ని రద్దు చేయాలని అంగన్‌వాడీ టీచర్లు గురువారం సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధన్ శంకర్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రీ-ప్రైమరీ, పీఎం శ్రీ పథకాల కింద ఏర్పాటు చేసిన 4,131 కేంద్రాల నిర్ణయాన్ని పునఃసమీక్షించి, వాటిని తిరిగి అంగన్‌వాడీల ఆధ్వర్యంలో కొనసాగించాలని కోరారు.

సమీకృత శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను అంగన్‌వాడీ సిబ్బందికే అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బావాయి భువనేశ్వర్, స్థానిక నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు భోజమ్మ, ప్రియాంక, ఆయాలు సుజాత, రజకళ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply