గద్వాల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఇన్చార్జిగా నూరుద్దీన్

మక్తల్, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఇంచార్జిగా మక్తల్ పట్టణానికి చెందిన నూరుద్దీన్ నియమితులయ్యారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్న నూరుద్దీన్ ను జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జిగా నియమిస్తూ మైనార్టీ సెల్ జాతీయ కోఆర్డినేటర్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ హెచ్ఎం.
షకీల్ నవాజ్ ఈ మేరకు నూరుద్దీన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూరుద్దీన్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతవే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
జిల్లాలోని మైనారిటీలు అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు శాయ శక్తుల పని చేస్తానని అన్నారు. కాగా జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఇన్చార్జిగా నూరుద్దీన్ నియామకం పట్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాలంబిన్ ఉమర్ బస్రవి, ఎండి. ఫయాజ్, కాంగ్రెస్ నాయకులు మంజూర్ ఇలాహి,అబ్దుల్ రహమాన్, అఫ్రోజ్ తదితరులు వర్షం వ్యక్తం చేశారు.
