స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు


కన్నులపండువగా సీతారాముల కల్యాణం
-గ్రామాల్లో భక్తులతో కళకళలాడిన ఆలయాలు
-ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు శుక్రవా రం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మండ లంలోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేద మంత్రోచ్ఛర ణల మధ్య సీతాసమేత శ్రీరామచంద్ర స్వామి వారి కల్యాణం కన్నులపం డువగా జరిగింది. వేడుకల సందర్భంగా ఆలయాలను ఒక రోజు ముందుగానే విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆల యాలకు తీసుకువచ్చి, భజనల నడుమ మధ్యాహ్న సమయంలో ముత్యాల తలంబ్రాలతో కల్యాణోత్సవాన్ని భక్తిపూర్వకంగా నిర్వహిం చారు.

-ప్రతి గ్రామంలో ఘనంగా సీతారాముల కల్యాణం:

మండల పరిధిలోని చాగల్లు, ఇప్పగూడెం, రంగారాయిగూడెం, కోమటి గూడెం, అక్కపల్లిగూడెం, తాటికొండ, పాంనూర్, రాఘవాపూర్, మీది కొండ, నమిలిగొండ, తానేదార్‌పల్లి, సముద్రాల తదితర గ్రామాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి గ్రామంలో ప్రత్యేక పూజలు, సీతారాముల కల్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిం చారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చాగల్లు గ్రామంలో దేవా లయాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించబడ్డాయి. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకు లు పోగుల సారంగపాణి, కౌన్సిలర్లు పొన్న రాజేష్, సౌదరపల్లి సంపత్ రాజు, అన్నెపు సుమలత కుమార్, బాలగాని అనిల్, నాయకులు దోమ ల ప్రభాకర్, ఇనుగాల నర్సింహా రెడ్డి, బూర్ల రమేష్, కూన రాజు, సందీ ప్, బూర్ల అనిల్, బూర్ల ప్రవీణ్, ఎదునూరి సాంబరాజు, అన్నెపు అనిల్, అరకాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.


అక్కపల్లిగూడెం గ్రామంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మగాళ్ల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గొట్టం సుష్మితతో పాటు కమిటీ సభ్యులు రాజు, హరీష్, మోహన్, విష్ణు, నవీన్, నగేష్, సాంబరాజు, రమేష్, రాజేందర్, సతీష్, శ్రీధర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

-కోమటిగూడెంలో:
కోమటిగూడెం గ్రామంలో సర్పంచ్ పనికర సోమయ్య ఆధ్వర్యంలో శ్రీరా మనవమి వేడుకలు ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహించారు. సీతా రాముల కల్యాణాన్ని భక్తులు ఉత్సాహంగా వీక్షించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-ఇప్పగూడెంలో:
ఇప్పగూడెం గ్రామంలో సర్పంచ్ మందపురం రాణి అనిల్ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామి వారికి పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్ర మం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింగనబోయిన రాజు, విగ్రహ దాతలు బెజ్జపల్లి ఉమా రాజు దంపతులు, కమిటీ సభ్యులు శ్రీధర్, ప్రకాష్ రెడ్డి, దామెర వేణు, ఎల్లగౌడ్, కత్తుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

-తాటికొండలో:
తాటికొండ గ్రామంలో సీతారాముల కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోలు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ మారపాక సుజన శ్రీనివాస్, ఉపస ర్పంచ్ కట్టమల్లు తదితరులు పాల్గొన్నారు.

-రాఘవాపూర్‌లో:
రాఘవాపూర్ గ్రామంలో సర్పంచ్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చి, గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అన్నదానం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుర్రపు నర్సింహులు, చైర్మన్ రావుల రవి, వైస్ చైర్మన్ బత్తిని రాజు, సభ్యులు పిట్టల రాజేందర్ తది తరులు పాల్గొన్నారు.

-మీదికొండలో:
మీదికొండ గ్రామంలో సర్పంచ్ జోగు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణంతో పాటు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు నాగరబోయిన యాదగిరి, నాగరబోయిన శ్రీరాములు, సూదుల రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీను, వనం మధు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply