Incident | పాపం ఈతకెళ్లి నలుగురు…

Incident | పాపం ఈతకెళ్లి నలుగురు…

Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది.

కర్నూల్ జిల్లా కోసిగి మండలం కందుకూరులో తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన నలుగురు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. కాగా, మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని కురుడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply