INDvsAFG | ఇది టీమిండియానా.. సగం మంది ఆ ఐపీఎల్ జ‌ట్టు ప్లేయర్లే..

INDvsAFG | ఇది టీమిండియానా.. సగం మంది ఆ ఐపీఎల్ జ‌ట్టు ప్లేయర్లే..

ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ప్రకటించిన భారత జట్టుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జ‌రుగుతుంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన పలువురు ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో నెటిజన్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లు గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడిన నేపథ్యంలో.. ఇది టీమిండియా టెస్టు జట్టా.. లేక గుజరాత్ టైటాన్స్ టీమా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

సగం మంది గుజరాత్ ప్లేయర్లే ఉన్నారు కదరా.., టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినా జీటీ క్యాంప్‌లానే కనిపిస్తోంది. ఐపీఎల్‌లో గుజరాత్ బాగా ఆడిందని టెస్టు జట్టునే గుజరాత్‌తో నింపేశారా? అంటూ అభిమానులు మీమ్స్, ట్రోల్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

Leave a Reply