శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న గద్దె అనురాధ

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న గద్దె అనురాధ
రామరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్ష
ఆంధ్రప్రభ, పటమట : నగరం లోని 8వ డివిజన్ శ్రీరామ్ నగర్‌లో ఘనంగా నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పందిరిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, శ్రీరాముడు భారతీయ సంస్కృతిలో ధర్మానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. రాముని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన పాలన రామరాజ్యం ప్రజలకు న్యాయం, సమానత్వం, శాంతి, సుసంపన్నతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

అలాగే శ్రీరాముని దయ కటాక్షాలు రాష్ట్రంపై ఉండి, ప్రజలకు మేలు చేసే విధంగా చంద్రన్న పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. రామరాజ్యం స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తూ, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా పాలన సాగిస్తుందని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో కూడా రాముని ఆలోచనలు, విలువలు అనుసరించడం అత్యంత అవసరమని ఆమె చెప్పారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పాలన కొనసాగాలని, రాష్ట్రం మొత్తం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని ఆమె ప్రార్థించారు.

