ఎంతో వైభవంగా సీతారాముల కళ్యాణం..

జన్నారం, ఆంధ్రప్రభ : శ్రీరామనవమిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలోని శ్రీ పట్టాభి సీతారామ చంద్రస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఎ రంగా రంగా వైభవంగా ఎంతో ఘనంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించారు.

శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ మిక్కిలినేని రాజశేఖర్- పద్మజవల్లి దంపతులు,ఎం.ఆర్ నర్సింగరావు-దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో సీతారాముల కళ్యాణం స్థానిక పండితులు గుండి సత్యనారాయణ, నరహరి శర్మ,గణేష్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు వేసి,తాగునీటి సౌకర్యం కల్పించారు.దర్శనానికి వచ్చే భక్తులందరి కోసం ప్రసాదం అందించి,అన్నదానం చేశారు.పలువురు భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని క్యూలైన్లో దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని,పూజలు చేశారు.

ఆ తర్వాత భక్తులు కళ్యాణాన్ని కనుల పండుగగా తిలకించారు.ఈ కార్యక్రమంలో కమిటి కోశాధికారి గుండ సుధాకర్,కమిటి నేతలు గుర్రం మోహన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండలంలోని రేండ్లగూడ,తిమ్మాపూర్ గ్రామాల్లోని రామాలయం ఆలయాల్లో సీతారాముల వివాహం ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.