కన్నుల పండుగగా రాములోరి కల్యాణం

కన్నుల పండుగగా రాములోరి కల్యాణం

ఇల్లందకుంట ఆంధ్రప్రభ : అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో అత్యంత వైభోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమైనది. కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అంద చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రం సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నారు

Leave a Reply