శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం..
శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం..
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకు ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. శ్రీరామ నవమి కేవలం పండుగ మాత్రమే కాదనీ, ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకం అన్నారు.
శ్రీరాముడు ధర్మం, నిజాయితీ, సహనం, కర్తవ్యానికి ప్రతీక అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడవాలని నేర్పుతుందన్నారు. కష్టాలు వచ్చినా ఓర్పుతో ఉండాలని, నిజం కోసం నిలబడాలి అనే గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. అలాంటి శ్రీరామనవమి రోజు రాముడి గొప్పతనం తలుచుకుంటూ ఉండాలంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
