టెక్‌ట్రిక్స్ – 2026లో యువ ఆవిష్కర్తల సత్తా…
టెక్‌ట్రిక్స్ – 2026లో యువ ఆవిష్కర్తల సత్తా…
జాతీయ సాంకేతిక దినోత్సవం వేడుకల్లో స్టార్టప్స్‌కు నగదు బహుమతులు
విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు
విజయవాడ, ఆంధ్రప్రభ : జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని విజయవాడ రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)లో సోమవారం జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీఐహెచ్ సంయుక్తంగా నిర్వహించిన టెక్‌ట్రిక్స్ 2026 – స్టార్టప్ ఎక్స్పో ఘనంగా జరిగింది. యువ పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేటర్లు ప్రదర్శించిన సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి.
వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం..
స్టార్టప్ ఎక్స్‌పోలో పాల్గొన్న పలు సంస్థలు తమ సృజనాత్మక వ్యాపార నమూనాలు, ఆధునిక సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించాయి. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు, యువతలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించే దిశగా కార్యక్రమం విజయవంతమైంది.
విజేతలకు నగదు బహుమతులు..
ప్రత్యేక కమిటీ నిర్ణయం మేరకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్టప్స్‌కు నగదు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి (రూ. 30 వేలు): నిఘాటెక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ (పవన్ విజయ్)
ద్వితీయ బహుమతి (రూ 20 వేలు):* పెట్జు (సీహెచ్ సాయి మాధవ్) తృతీయ బహుమతి (రూ 15 వేలు):
జెనీ బాక్స్ (ప్రమోద్ రెడ్డి)..
యువతలో ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు, స్టార్టప్‌ల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సాంకేతికత ఆధారంగా సమాజ సమస్యలకు పరిష్కారాలు అందించే యువతను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
