Ap Heatwave Alert : తస్మాత్​ జాగ్రత్త Andhra Prabha Latest News

Ap Heatwave Alert : తస్మాత్​ జాగ్రత్త Andhra Prabha Latest News

ఫ్రైడే జర భద్రం

తీవ్ర వడాల్పులు వీస్తాయి

వాతావరణ శాఖ హెచ్చరిక

(ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్​)

Ap Heatwave Alert : పార్వతీపురంమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ , ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు (09) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

Ap Heatwave Alert : రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (32): విజయనగరం 4, పార్వతీపురం మన్యం 3, పోలవరం 3, కాకినాడ 1, తూర్పుగోదావరి 2, ఏలూరు 4, కృష్ణా 2, ఎన్టీఆర్ 7, గుంటూరు 1, పల్నాడు జిల్లాల్లోని 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. శనివారం 90 మండలాల్లో
వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

Ap Heatwave Alert : గురువారం కడప(జి) కమలాపురంలో 40.7°C, అనంతపురం(జి) తెరన్నపల్లి 40.6°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి 40.5°C, నంద్యాల(జి) కొత్తపల్లె 40.4°C, కర్నూలు(జి) బస్తిపాడులో40.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Ap Heatwave Alert : ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని ప్రఖర్ జైన్ సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు.

Leave a Reply