సంపద సృష్టించేందుకు సీ అండ్ డీ ప్లాంట్…

సంపద సృష్టించేందుకు సీ అండ్ డీ ప్లాంట్…
కమిషనర్ ధ్యాన చంద్ర
విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : నగరం లోని నిర్మాణ వ్యర్ధాలతో సంపదను సృష్టించేందుకు సిఎన్డి ప్లాంట్ పూర్తి స్థాయి లో అందు బాటులో ఉందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం సాయంత్రం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లోని సి అండ్ డి ప్లాంట్ పని తీరు ను క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడున్నా సరే వాటిని అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లోకి తరలించి, అక్కడున్న సిఎన్డి ప్లాంట్ని ఉపయోగించి నిర్మాణ వ్యర్థాలతో పాదచర్ల కోసం వేసే పేపర్ బ్లాక్స్, సిమెంట్ ఇటుకలు తయారు చేసి విజయవాడ నగర పాలక సంస్థ చేసే అభివృద్ధి పనుల్లో ఉపయోగించాలని, ప్రజలకు కావాలన్నా విజయవాడ నగర పాలక సంస్థ వారు నుండి పొందవచ్చని అన్నారు.
ముఖ్యంగా పట్టణ ప్రణాళిక అధికారులు ఎప్పటికప్పుడు డ్రోన్ తో పర్యవేక్షిస్తూ నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడా లేకుండా నిర్ధారించుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
