చిలకలూరిపేటలో UTF నిరాహార దీక్ష

చిలకలూరిపేటలో UTF నిరాహార దీక్ష

చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి భాగంగా United Teachers Federation (UTF) పిలుపు మేరకు Chilakaluripet నియోజకవర్గ కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మంగళవారం “రణభేరి” పేరిట ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షను ఏపీఎన్‌జీవో నాయకులు బి. హనుమంత నాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా UTF అధ్యక్షుడు కే. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 12వ పీఆర్‌సీ చైర్మన్‌ను వెంటనే నియమించడం, 29 శాతం ఐఆర్ ప్రకటించడం, పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయడం, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలను పరిష్కరించడం, సీపీఎస్ రద్దు వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. దీక్ష అనంతరం డిప్యూటీ తాసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ మండలాల UTF నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.