వర్సిటీల్లో నియామకాలు పారదర్శకంగా జరగాలి: నారా లోకేష్
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నియామకాల్లో ఎలాంటి అక్రమాలు లేదా ఆరోపణలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనల ఉల్లంఘనలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కొత్త పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను సిద్ధం చేయాల్సిన అవసరాన్ని లోకేష్ ప్రస్తావించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అనుసంధానించి, నైపుణ్యాల లోటును భర్తీ చేసేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
