గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు..

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఉదయం పాము కాటు వేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఉదయం పాము కాటు వేసింది. దీంతో విద్యార్థిని హుటాహుటిన జీజీహెచ్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు.
కామారెడ్డి జిల్లా సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో గాంధారి మండలం జెమినీ తండాకు చెందిన బానోత్ చరణ్ పదవ తరగతి విద్యార్థి విద్య ను అభ్యసిస్తున్నాడు. అయితే రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఉపాధ్యాయులు విద్యార్థులకు టీ బ్రేక్ ఇచ్చారు. దీంతో చరణ్ పాఠశాల మైదానంలోకి రాగానే ఎడమ కాలు పాదం పైన పాము కాటు వేసింది. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ అతనికి చికిత్స కొనసాగుతోంది.
