కౌలాస్ నాలా నుంచి నీరు విడుదల
జుక్కల్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సావర్ గాం వద్ద గల కౌలాస్ నాల ప్రాజెక్టు(Kaulas Nala Project)లో తుఫాన్ కారణంగా వరద నీరు వచ్చి చేరడంతో మూడు గేట్లు ఎత్తి విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టు ఏఈఈ సుకుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 4113 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని, వెంటనే అప్రమత్తమై మూడు గేట్లు ఎత్తి అంతే నీటిని కాలువ ద్వారా విడుదల చేశామన్నారు.
ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందందున నీటి విడుదల పెరిగే అవకాశం ఉంది కాబట్టి, వరద కాలువ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458 మీటర్ కాగా ప్రాజెక్టులో 458 మీటర్ల(458 mts) నీటిని నిలకడగా ఉంటుందన్నారు. నీటి నిల్వలు 1.237 టీఎంసీలు ఉన్నాయి.

