ఎస్ఐ నీ మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సిహెచ్. సతీష్ ను శుక్రవారం కమ్మర్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐ సతీష్ ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతిభద్రతలను మరింత పటిష్టంగా అమలు చేస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు అజ్మత్ పాషా, నల్ల సాయి కుమార్ గుప్తా, వేములవాడ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply