సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం రైతుల ఖాతాలో రైతు బందు నిధులు జమ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మండల కేంద్రమైన కడెం లోని స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ల చిత్రపటాలకు పాలభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషన్ నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు రైతులకు ఇచ్చిన హామీల మేరకు ప్రతి సంవత్సరం రెండుమార్లు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి జిల్లా కార్యదర్శి బి దేవేందర్ గౌడ్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టి మల్లేష్ యాదవ్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బి రమేష్ వర్మ సర్పంచుల ఫోరం కడెం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ మండల నాయకులు బొడ్డు గంగన్న ముసుకు రాజేందర్ రెడ్డి షేక్ రఫీక్ తొట్ల ధర్మయ్య ఎండి సలీం డి శేఖర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు బొడ్డు గంగన్న నర్సింగ్ అశ్విత రమేష్ బొంతల లక్ష్మీ భూమన్న శిరీష సత్యం చీమల భీమేష్ నాయకులు గంగాధర్ ఎండి షర్ఫుద్దీన్ తొట్ల గంగాధర్ మల్లయ్య పడిగల రాజు రాజన్న రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply