BRS | గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో ఆందోళన

BRS | గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో ఆందోళన

BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముందుగా గన్‌పార్క్ వద్దకు చేరుకున్న వారు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.

అనంతరం అదే ప్లకార్డులతో అసెంబ్లీ వైపు ర్యాలీగా బయల్దేరారు. గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతూనే, హోటళ్లు, చిరు వ్యాపారాలకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేయడాన్ని వారు తప్పుబట్టారు.

గ్యాస్ కొరత కారణంగా సాధారణ ప్రజలతో పాటు చిరు వ్యాపారులు, హోటల్ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి దెబ్బతింటోందని బీఆర్ఎస్ సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ సరఫరా సంక్షోభంపై నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply