మత విద్వేషాలను సృష్టించడం సరికాదు..

మత విద్వేషాలను సృష్టించడం సరికాదు..

నెక్కొండ, ఆంధ్రప్రభ : కొంత మంది వ్యక్తులు మత విద్వేషాలను సృష్టించాలని చూస్తున్నారని అలాంటి వారిని సహించేది లేదని టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. నెక్కొండ మండల కేంద్రంలోని పరిశుద్ధాలుక దేవాలయం 82 వ వార్షికోత్సవ దేవాలయ ప్రతిష్ట పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చర్చి పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల కాలంలో కొంత మంది చర్చి స్థలం పై అపోహలు సృష్టించి గందరగోళానికి గురి చేసినట్లు తెలిపారు. చర్చి స్థలం ప్రభుత్వం కాపాడుతుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో చర్చి అభివృద్ధి చేస్తామని అన్నారు.

1945 సంవత్సరంలో ఈ పరిశుద్ధాత్మక దేవాలయం ప్రారంభించారని ఇప్పటి వరకు 40 మంది పాస్టర్లు 20 మంది వార్డెన్లు.. అలాగే వేలాది మంది కులమతాలకు అతీతంగా చర్చి ద్వారా ఉన్నత విద్య వరకు లబ్ధి పొందినట్లు తెలిపారు. నెక్కొండ పట్టణంలో క్రైస్తవులు, బీద కుటుంబాలు ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఈ చర్చి ఉపయోగపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, సర్పంచ్ పెండ్యాల హరి ప్రసాద్, ఉప సర్పంచ్ సింగం శ్రావణి ప్రశాంత్, వరంగల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్, సెక్రటరీ అరుణ్, శ్రీనివాస్ నాయక్, ప్రసాద్, సంపత్, రామచందర్, వెంకన్న, మాణిక్యం, భాస్కర్, అరుణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply