దాతృత్వం చాటుకున్న టీడీపీ నేతలు

దాతృత్వం చాటుకున్న టీడీపీ నేతలు

పెదకూరపాడు, ఆంధ్రప్రభ : మండలం గారపాడు గ్రామంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సామల శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి వారికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ 15,000 ఆర్ధిక సహాయం అందించిన పెదకూరపాడు మండల పార్టీ అధ్యక్షులు ఏటుకూరి బ్రహ్మయ్య రూ.5000 అందించారు. మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఆర్తిమల్ల రమేష్ రూ.5000, పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు మక్కెన సాగర్ రూ.5000లు అందించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గుడిపూడి చిన్న రాజు, పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ర ప్రసాద్, పెదకూరపాడు మండల పార్టీ ఉపాధ్యక్షులు పెనుముచ్చు రమేష్, గారపాడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పొదిలి కోటేశ్వరరావు, హుస్సేనగరం గ్రామ నాయకులు నెల్లూరి మల్లికార్జునరావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply